డిసెంబర్ 26 నుంచి నెహ్రూ కప్​ అంతరాష్ట్ర క్రికెట్​ పోటీలు

భద్రాచలం,వెలుగు :   ఈనెల 26నుంచి  భద్రాచలం ప్రభుత్వ జూనియర్​ కాలేజీ  గ్రౌండ్​ లో నెహ్రూ కప్​ అంతరాష్ట్ర క్రికెట్​ పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు వాతాడి దుర్గా అశోక్, తోటమల్ల బాలయోగి తెలిపారు.  ఈ మేరకు శుక్రవారం వారు మీడియాతో మాట్లాడారు.  

1994 నుంచి ఈ టోర్నమెంట్​నిర్వహిస్తున్నట్లు వివరించారు. విజేత, రన్నర్​ జట్లకు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేస్తామని చెప్పారు.  ఆసక్తి కలిగిన జట్లు ఈనెల 15  లోపు కన్వీనర్​ ఎస్కే సలీంకు ఎంట్రీలు పంపించాలని, 9440101108  నెంబర్​ను  సంప్రదించాలని కోరారు.