నవంబర్ 25 నుంచి వికసిత్​ భారత్ చాలెంజ్ : విజయరావు

పద్మారావునగర్, వెలుగు : ఈ నెల 25 నుంచి ‘వికసిత్ భారత్​ ఛాలెంజ్’ ప్రారంభిస్తున్నట్లు నెహ్రూ యువ కేంద్ర సంఘటన్​ స్టేట్​ డైరెక్టర్ విజయరావు తెలిపారు. దీనితో ప్రధాని నరేంద్రమోదీతో నేరుగా మన భావాలు, సూచనలు  పంచుకునే అవకాశం లభిస్తుందన్నారు. కవాడిగూడలోని సీజీఓ టవర్స్​లోని ప్రెస్​ఇన్​ఫర్మేషన్​బ్యూర్​ఆడిటోరియంలో శుక్రవారం ఆమె మాట్లాడారు. వికసిత్​భారత్​యంగ్​లీడర్స్ పేరిటి ఆన్​లైన్​ లో నిర్వహించే కార్యక్రమంలో యువత ఉత్సాహంగా పాల్గొనాలని కోరారు. 25 నుంచి పేర్లు రిజిస్ట్రేషన్​ చేసుకుని, డిజిటల్​ క్విజ్​లో పాల్గొనవచ్చన్నారు. 

2025 జనవరి 11, 12 తేదీల్లో నేషనల్​యూత్​ ఫెస్టివల్​ఉంటుందన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, దేశవ్యాప్తంగా ఎంపికైన 3 వేల మంది యువనేతల మధ్య ముఖాముఖి జరుగుతుందన్నారు. వికసిత్​ భారత్ చాలెంజ్ అనేది నాలుగంచెల పోటీ అని, యువత ఇందులో పాల్గొని తమ ఆలోచనలను పంచుకోవచ్చన్నారు. 15 నుంచి 29 ఏండ్ల మధ్య ఉన్న వారంతా పాల్గొనవచ్చన్నారు. 

వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్  నేషనల్ యూత్ ఫెస్టివల్, 2025కు సంబంధించిన అన్ని వివరాలు https://mybharat.gov.in లో అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా యువజన అధికారి  కుష్బూ గుప్తా, స్పోర్ట్స్​అసిస్టెంట్ డైరెక్టర్ నిషా విద్యార్థి, అర్జున, పద్మశ్రీ పురస్కారాల గ్రహీల ఎన్​.ముఖేశ్, అథ్లెటిక్స్​చీఫ్ కోచ్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎన్.రమేశ్, ఆసియా పతక విజేత నందినీ అగర్సర, పీఐబీ గాయత్రి పాల్గొన్నారు.