
హైదరాబాద్, వెలుగు: ఈ నెల 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా నెహ్రూ జూలాజికల్ పార్క్ఓపెన్ ఉంటుందని జూపార్క్ క్యూరేటర్ జె.వసంత తెలిపారు. సాధారణంగా ప్రతి సోమవారం జూపార్క్కు హాలిడే ఉంటుంది. ఈ సోమవారం మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జూపార్క్ ఓపెన్ ఉంటుందని వెల్లడించారు.