లోక్ సభ ఎన్నికలు.. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్

లోక్ సభ ఎన్నికలు.. సోమవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్

తెలంగాణలో లోక్ సభఎన్నికల నేపథ్యంలో రేపు(మే13) నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ క్లోజ్ కానుంది. ఈ విషయాన్ని  జూలాజికల్ పార్క్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.  " లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా, హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ పోలింగ్ రోజున అంటే 2024 మే 13వ తేదీ సోమవారం రోజున   మూసివేయబడుతుంది. తిరిగి యథావిధిగా  2024 మే 14వ తేదీ మంగళవారం రోజున ఉదయం 08 గంటల  నుండి సాయంత్రం 05 గంటల వరకు సందర్శకుల కోసం తిరిగి తెరవబడుతుంది. సందర్శకులు ఈ విషయాన్ని గమనించి పార్క్ నిర్వహణకు సహకరించవలసిందిగా కోరుతున్నాం "  అని వెల్లడించారు. 

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. 17 లోక్ సభ నియోజకవర్గాలకు రేపు ఉదయం 7గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు. ఉదయం 4 గంటల నుంచి 5గంటల లోపు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 వేల పోలింగ్ కేంద్రాల ముందు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసింది ఈసీ.  సమస్యాత్మకమైన ప్రాంతాల్లో రెండంచల భద్రత ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు చేశామని ప్రజలు నిర్భయంగా ఓటేయాలని పిలుపునిచ్చారు ఎన్నికల అధికారులు. ప్రలోభాలకు గురిచేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు పోలీసులు. పోలింగ్ ముగిసే వరకు పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటారన్నారు.