నెక్కొండ, వెలుగు: వరంగల్ జిల్లా నెక్కొండ తెలంగాణ రెసిడెన్సియల్గర్ల్స్ స్కూల్, జూనియర్ కాలేజీలో చదువుకోవాలంటే బాలికలకు తిప్పలు తప్పడం లేదు. ఈ టీజీరెసిడెన్సియల్ విద్యా సంస్థలో ఐదు నుంచి పదో తరగతి వరకు 480 మంది, ఇంటర్మీడియల్ఫస్ట్, సెకండియర్ స్టూడెంట్స్160 మంది ఉండగా, వారందరికీ గదులు సరిపోవడం లేదు.
దీంతో చదువు, తినడం, పడుకోవడమూ ఒకే చోట కావడంతో స్టూడెంట్స్తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయమై ప్రిన్సిపల్ మమతతో మాట్లాడగా, సరిపడా గదుల్లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, సమస్య పరిష్కరించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.