కొండ మల్లేపల్లి(పీఏ పల్లి), వెలుగు: దేవరకొండ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ధీమా వ్యక్తం చేశారు. పీఏ పల్లి మండలం చిలుకమర్రి గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ జిల్లా నేత దుదిపాల రాజేందర్ రెడ్డి అధ్వర్యంలో 100 కుటుంబాలు కాంగ్రెస్‌లో చేరాయి. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రవీంద్రనాయక్‌కు ఆస్తులు పెంచుకోవడంలో ఉన్న ధ్యాస నియోజకవర్గ అభివృద్ధిపై లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో బీఆర్‌ఎస్ నేతలకు చెమటలు పడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ జడ్పీ ఫ్లోర్ లీడర్ అలుగుబెల్లి శోభారాణి ఏవీ రెడ్డి, మండల అధ్యక్షుడు ఎల్లయ్య యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ బొడియ నాయక్, నేతలు అడెపు సతీష్, మధుసూదన్ రెడ్డి, నారాయణ, ఆంజనేయులు, సర్పంచ్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.