![స్టూడెంట్.. నా కెరీర్‌కు ప్లస్ అవుతుంది](https://static.v6velugu.com/uploads/2023/06/Hero-Bellamkonda-Ganesh_t5rvcWeaZ7.jpg)
‘స్వాతిముత్యం’ సినిమాతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ గణేష్.. ‘నేను స్టూడెంట్ సర్’ అనే యాక్షన్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. అవంతిక దస్సాని హీరోయిన్. రాకేష్ ఉప్పలపాటి దర్శకుడు. ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించారు. జూన్ 2న సినిమా విడుదలవు తున్న సందర్భంగా గణేష్ మాట్లాడుతూ ‘ఇదొక న్యూ ఏజ్ థ్రిల్లర్. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. లైఫ్‌లో హ్యాపీగా ముందుకెళ్తున్న హీరోకి సమస్యలు ఎదురవుతాయి.
దాంతో బాధ, టెన్షన్ ఎక్కువవుతాయి. తనకు వచ్చిన కష్టాలను ఎలా ఎదుర్కున్నాడనేది కాన్సెప్ట్. ఇందులోని క్యారెక్టర్ ఆర్క్, ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యాను. క్లైమాక్స్ వరకూ విలన్‌ను ఊహించలేరు. కథలో వచ్చే మలుపులు ఆసక్తి రేపుతాయి. ఆ క్యూరియాసిటీ సినిమా అంతా కొనసాగుతుంది. చాలామంది స్టార్ హీరోలు వాళ్ల రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఈ సినిమా కూడా నాకు అలా ప్లస్ అవుతుంది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుంది. మొదటి పది సినిమాలు డిఫరెంట్ జానర్స్‌లో చేసి, మంచి నటుడిగా ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటున్నా. నెక్స్ట్ ఒక క్రైమ్ కామెడీ మూవీ చేయబోతున్నా’ అన్నాడు.