ఓవైపు హోరీహోరీగా వరల్డ్ కప్ పోరు జరుగుతుంటే.. మరోవైపు నేపాల్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. ప్రపంచకప్‌లో ఆడాలనే తన కలను సాకారం చేసుకుంది. అమెరికా, వెస్టిండీస్‌లు సంయుక్తంగా అతిథ్యమివ్వనున్న 2024 టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది. ఆసియా క్వాలిఫయర్స్ పోరులో యూఏఈను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసిన నేపాల్.. తొలిసారి టీ20 ప్రపంచ కప్‌కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ 134 పరుగులు చేయగా.. నేపాల్ 2 వికెట్లు కోల్పోయి మరో 17 బంతులు మిగిలివుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. నేపాల్ బ్యాటర్లలో ఆసిఫ్ షేక్(64 నాటౌట్) హాఫ్ సెంచరీ చేయగా.. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పౌడెల్(34) పర్వాలేదనిపించాడు. మరో మ్యాచ్‌లో బెహ్రయిన్‌పై 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఒమన్ సైతం 2024 టీ20 వరల్డ్ కప్ కు అర్హత సాధించింది.
A country that loves its cricket ❤️
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2023
Nepal secure their place in the 2024 T20 World Cup after an eight-wicket win over UAE in the semi-final of the Asia Qualifier ?? #T20WorldCup pic.twitter.com/klrPFiLuXw
WOW ?
— ESPNcricinfo (@ESPNcricinfo) November 3, 2023
Oman qualify for the 2024 T20 World Cup after a 10-wicket win over Bahrain in the semi-final of the Asia Qualifier ?? #T20WorldCup pic.twitter.com/DEMEr4UaFx
పోటెత్తిన అభిమానం
ఇదిలావుంటే, ఈ మ్యాచ్ చూసేందుకు నేపాల్ అభిమానులు పోటెత్తారు. స్టేడియం చిన్నదైనా, సౌకర్యాలు లేకపోయినా వేలసంఖ్యలో మ్యాచ్ చూసేందుకు తరలివచ్చారు. స్టేడియం చుట్టుప్రక్కల ఉన్న పెద్ద పెద్ద భవనాలు సైతం అభిమానులతో కిటకిటలాడాయి. ఆ దృశ్యాలు భారత అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
The passion for cricket in ??Nepal is pure madness!
— Aneeta Sharma???? (@AneetaSharma56) November 3, 2023
~ Nepal's cricket team is among the luckiest globally, having such a loyal and devoted fan base! ???
#NepalCricket #NEPvUAE#ICCWorldCup2023 #PAKvsNZ pic.twitter.com/Yd6AeiJvV5