నేపాల్ ప్రధాన సైన్యాధికారి జనరల్ అశోక్ రాజ్ సిగ్డెల్కు భారత సైన్యంలో గౌరవ జనరల్ హోదాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రదానం చేశారు. గత నెలలో భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేదిని నేపాల్ సైన్యంలో గౌరవ జనరల్ హోదాతో నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ సత్కరించారు.
రెండు దేశాలు తమ ప్రధాన సైన్యాధికారులను 1950 నుంచి ఇలా పరస్పరం గౌరవించుకుంటున్నాయి. సైన్యాధికారిగా అసమాన ప్రావీణ్యం కనబర్చి, భారత్– నేపాల్ బంధాన్ని మరింత పటిష్టం చేయడానికి జనరల్ సిగ్డెల్ పాటుపడ్డారు. రెండు దేశాల మధ్య ఉన్న చిరకాల, వ్యూహాత్మక రక్షణ సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతుంది.