మన దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలలపై మరో దేశం నిషేదం విధించింది. ఈ మసాలాల్లో క్యాన్సర్ కారక పధార్థాలున్నాయనే కారణంతో ఇప్పటికే హాంకాంగ్, సింగపూర్, బ్రిటన్ నిషేదం విధించగా..ఈ లిస్ట్ లో ఇపుడు పొరుగున ఉన్న నేపాల్ చేరింది. మసాలాల దిగుమతులతో పాటు విక్రయాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మసాలా దినుసుల్లో ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు వార్తలు రావడంతో నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తాము ఈ రెండు కంపెనీల మసాలాలను టెస్ట్ చేస్తున్నట్లు తెలిపింది. తుది నివేదిక వచ్చే వరకు నిషేదం ఉంటుందని తెలిపింది.
ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై బ్రిటన్ మే 16న నిషేదం విధించింది. దినుసుల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తుజరుగుతోందని.. పూర్తి స్థాయి నివేదిక వచ్చే వరకు బ్యాన్ కొనసాగుతుందని తెలిపింది. ఇంతకు ముందు కూడా MDH, ఎవరెస్ట్ ఉత్పత్తులపై హాంకాంగ్ నిషేధం విధించింది. ఈ రెండు కంపెనీల ద్వారా వచ్చిన మూడు మసాలా మిశ్రమాల అమ్మకాలను నిలిపివేసింది. ఇందులో క్యాన్సర్ కారర పురుగు మందు ఇథిలీన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉందని అమ్మకాలపై నిషేధం విధించింది.
సింగపూర్ కూడా ఎవరెస్ట్ మిక్స్ ను రీకాల్ చేయాలని ఆదేశించింది. వీటితో పాటు న్యూజిలాండ్, యూఎస్, ఇండియా , ఆస్ట్రేలియా ఆ రెండు బ్రాండ్ లకు సంబంధించిన సమస్యలను పరిశీలిస్తున్నట్లు తెలిపాయి.