సినిమా రిలీజై ఆరు నెలలైనా పుష్ప క్రేజ్ తగ్గడం లేదు. పుష్పలో అల్లు అర్జున్ తగ్గేదేలే స్టైల్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలుసు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు, సెలబ్రిటీలు పుష్ప స్టైల్ లో తగ్గేదేలా డైలాగ్ గు విపరీతంగా క్రేజ్ వచ్చింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఇండియన్ ఆల్ రౌండర్ జడేజా, మాజీ కెప్టెన్ కోహ్లీ ఇలా అందరు పుష్ప స్టైల్ లో తగ్గేదేలా స్టైల్ ను అనుకరించడంతో పుష్ప క్రేజ్ దేశవిదేశాల్లో మార్మోగింది. అప్పటి నుంచి ఎక్కడ చూసినా పుష్ప మానియా ఓ రేంజ్ లో ఉంది. లేటెస్ట్ గా నేపాల్ మహిళా బౌలర్ వికెట్ తీసిన తర్వాత పుష్ఫ స్టైల్ అనుకరించిన ఓ వీడియోను ఐసీసీ తన ట్విట్టర్లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.
దుబాయ్ లో ఫెయిర్ బ్రేక్ ఇన్విటేషనల్ టోర్నమెంట్ జరుగుతోంది. మే 5న టోర్నడో ఉమెన్, సఫెరీ ఉమెన్ మద్య జరిగిన మ్యాచ్ లో నేపాల్ బౌలర్ సీతారాణా మగర్ వికెట్ తీసిన తర్వాత దవడ కింద చెయ్యితో పుష్ప స్టైల్ తో తగ్గేదేలా అంటూ సెలబ్రేట్ చేసుకుంది. ఈ వీడియోను ఐసీసీ ట్విట్టర్లో షేర్ చేసింది. నేపాల్ బౌలర్ సీతారాణా మగర్ మోస్ట్ పాపులర్ సెలబ్రేషన్స్ చూడండి అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 19 లక్షలకు పైగా చూశారు.3 లక్షలకు పైగా లైక్ చేశారు.
“It’s gone so far on social media."
— ICC (@ICC) May 10, 2022
Nepal’s Sita Rana Magar with the most popular celebration currently ?
?️ @fairbreakglobal pic.twitter.com/wlTRf0KeFt