Nepal cricket: బీసీసీఐ గొప్ప మనసు.. నేపాల్ క్రికెటర్లకు భారత్‌లో శిక్షణ

Nepal cricket: బీసీసీఐ గొప్ప మనసు.. నేపాల్ క్రికెటర్లకు భారత్‌లో శిక్షణ

నేపాల్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో చాలా తక్కువ మందికే తెలుసు. అసోసియేట్ దేశమైనా, స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఆ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారు. నేపాల్ ఏ దేశం మీదైనా మ్యాచ్ ఆడితే ఆ దేశ అభిమానులు భారీగా తరలివస్తారు. సరైన స్టేడియం లేకున్నా నిలబడి మ్యాచ్ చూస్తూ క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో క్రికెట్ లవర్స్ చెట్లు ఎక్కి మ్యాచ్ లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇదిలా ఉండగా నేపాల్ క్రికెట్ జట్టుకు బీసీసీఐ మరోసారి తన సహాయంతో గొప్ప మనసు చాటుకుంది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనేందుకు నేపాల్ క్రికెట్ జట్టు రెండు వారాల పాటు భారత్‌లో పర్యటించనుంది. నేపాల్‌ భారత్‌లో పర్యటించడం ఈ ఏడాది రెండోసారి. అంతకుముందు ప్రపంచకప్‌కు సన్నాహకంగా గుజరాత్‌లో కొన్ని  శిక్షణ పొందుతున్న సమయంలో బరోడాతో జరిగిన కొన్ని మ్యాచ్‌లలో జట్టు పాల్గొంది.

ఇది నేపాల్ గుజరాత్, బరోడాతో జరిగిన  ముక్కోణపు సిరీస్. ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 కోసం నేపాల్ బెంగళూరులో శిక్షణా శిబిరాన్ని ప్రాక్టీస్ గా ఉపయోగించుకోనుంది. బీసీసీఐ చేసిన ఈ సహాయానికి ప్రశంసల వర్షం కురుస్తుంది. కేవలం నేపాల్ కే కాదు.. ఆఫ్ఘనిస్తాన్ కు సైతం సౌతాఫ్రికాతో జరగబోయే ఏకైక టెస్టు ఇండియాలోనే ఆడుకోమని బీసీసీఐ పర్మిషన్ ఇచ్చింది. సౌతాఫ్రికాతో అక్టోబర్ లో ఈ టెస్ట్ జరగనుంది.