మైనర్పై అత్యాచారం కేసులో ఆరోణపణలు ఎదుర్కొంటున్న నేపాల్ క్రికెటర్ సందీప్ లామిచానేకు ఊరట లభించింది. అతన్ని దోషిగా తేలుస్తూ గతంలో ఖాట్మండు జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును పటాన్ హైకోర్టు తోసిపుచ్చింది. అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో అతను జూన్ 1 నుంచి ప్రారంభంకానున్న 2024 టీ20 వరల్డ్కప్ ఎంపికకు అందుబాటులో ఉండనున్నాడు.
ఏంటి ఈ కేసు..?
2022 ఆగస్టులో ఖాట్మండులోని ఓ హోటల్లో సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ మైనర్ బాలిక పోలీసులకు చేసింది ఫిర్యాదు చేసింది. ఈ కేసు పూర్వపరాలువిచారించిన ఖాట్మండు జిల్లా కోర్టు.. 2024 జనవరిలో అతన్ని దోషిగా తేలుస్తూ 8 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అదే తీర్పులో అత్యాచారం జరిగిన సమయానికి బాధిత బాలిక మైనర్ కాదని, ఆమెకు రూ.2,00,000 నష్టపరిహారం చెల్లించాలని, కోర్టుకు రూ.3,00,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది.
దీనిని సవాల్ చేస్తూ లామిచానే పైకోర్టుకు వెళ్లగా.. తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన జస్టిస్ సూర్య దర్శన్, దేవ్ భట్టా డివిజన్ బెంచ్.. గతంలో జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. ఈ కేసులో అతన్ని నిర్దోషిగా తేలుస్తూ.. రేప్ కేసు ఆరోపణల నుండి విముక్తి కల్పించింది.
🚨 BREAKING 🚨
— Sportskeeda (@Sportskeeda) May 15, 2024
Sandeep Lamichhane has been proven innocent.
The Patan High Court has delivered its final verdict on the rape case filed against Sandeep Lamichhane, judging him innocent and reversing the previous decision.
He will be available for Nepal for the upcoming T20… pic.twitter.com/Q9FYHiV30Y
నిర్దోషిగా తేలడంతో జూన్లో ప్రారంభంకానున్న 2024 టీ20 వరల్డ్కప్ ఎంపికకు లామిచానే అందుబాటులో ఉండనున్నాడు. అయితే నేపాల్ క్రికెట్ ఇప్పటికే 15మందితో కూడిన తమ ప్రపంచ కప్ జట్టును ప్రకటించింది. కాగా, ఐసీసీ నిబంధనల ప్రకారం జట్టులో మార్పులు చేసుకునేందుకు ఈనెల 25వరకు అవకాశం ఉండటంతో.. జట్టులో అతనికి చోటు దక్కే అవకాశం ఉంది.
Nepal fans celebrating after Nepal High court declared Sandeep Lamichhane innocent. pic.twitter.com/0MOM3Na3YY
— Tanuj Singh (@ImTanujSingh) May 15, 2024