నేపాల్ లో భూకంపం వచ్చింది. శనివారం తెల్లవారుజామున నేపాల్ లో కొన్ని సెకన్ల పాటు భూ ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.8గా నమోదైనట్లు తెలిపారు అధికారులు. తెల్లవారుజామున ఘాడ నిద్రలో ఉన్న సమయంలో భూ ప్రకంపనలు రావడంతో ఉలిక్కిపడి లేచి అపార్టుమెంట్లు, ఇళ్ల నుండి పరుగులు పెట్టారు జనం. అయితే.. ఈ ప్రకంపనల వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవటంతో ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు.
టెక్టోనికల్ యాక్టివ్ ప్రాంతమైన హిమాలయన్ ఫాల్ట్ లైన్ వెంబడి ఉండటం వంటి భౌగోళిక కారణాల వల్ల నేపాల్ లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. ప్రకంపనలు సంభవించినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించాలని సూచించారు అధికారులు.
Also Read :- ఏపీలోని ప్రకాశం జిల్లా భూ ప్రకంపనలు
ఇదిలా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ కంపం వచ్చింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రెండు మండలాల్లో భూమి కంపించింది. 2024, డిసెంబర్ 21వ తేదీ శనివారం ఉదయం 11 గంటల సమయంలో భూమి కంపించింది.ఉమ్మడి ప్రకాశం జిల్లా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో ఈ ప్రకంపనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రెండు అంటే రెండు సెకన్లు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.