టిక్ టాక్... కొన్నేళ్ల క్రితం వరకు యూత్ ని ఒక ఊపు ఊపిన ఈ సోషల్ మీడియా యాప్ గురించి తెలీనివారు ఉండరనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అప్పట్లో చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ఈ యాప్ లో వీడియోస్ చేసి ఫేమ్ సంపాదించినోళ్లు చాలామంది ఉన్నారు. టిక్ టాక్ లో ఫేమస్ అవ్వాలన్న పిచ్చితో చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. అంత రేంజ్ లో ఉండేది దీని అడిక్షన్. దీనికి కరోనా సమయంలో చైనా వైఖరికి వ్యతిరేకంగా భారత్ సహా పలు దేశాలు టిక్ టాక్ ను బ్యాన్ చేశాయి.
తాజాగా నేపాల్ ప్రభుత్వం టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చట్టంలో సవరణలు చేయాలని నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదేశాలు జారీ చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ అన్నిటిని ఒకేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. అయితే, నేపాల్ లో టిక్ టాక్ పై ఉన్న బ్యాన్ ఎత్తేయడానికి కొన్ని షరతులు విధించింది ప్రభుత్వం.
Also Read :- 60 వేల ఉద్యోగాలకు.. 48 లక్షల మంది అప్లికేషన్స్
నేపాల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని, డిజిటల్ లిటరసీపై పెట్టుబడులు, నేపాల్ విద్యావ్యస్థను అభివృద్ధి చేసేందుకు తోడ్పడటం వంటి షరతులు విధించింది ప్రభుత్వం.మొత్తానికి, 2023లో నేపాల్ లో బ్యాన్ అయిన టిక్ టాక్ యాప్ మళ్ళీ అందుబాటులోకి రానుంది. ఇక సోషల్ మీడియా సెలబ్రిటీలకు పండగే అని చెప్పాలి.