ఖాట్మండు: వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికాలో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు ఒమన్, నేపాల్ క్వాలిఫై అయ్యాయి. శుక్రవారం జరిగిన క్వాలిఫయింగ్ టోర్నీ తొలి సెమీస్‌లో ఒమన్ 10 వికెట్ల తేడాతో బహ్రెయిన్‌ను ఓడించింది. బహ్రెయిన్ 20 ఓవర్లలో 106/9 స్కోరు చేసింది. ఇమ్రాన్ అలీ (30) టాప్ స్కోరర్. అఖీబ్ ఇలియాస్ 4 వికెట్లు తీశాడు. తర్వాత ఒమన్ 14.2 ఓవర్లలో 109/0 స్కోరు చేసి నెగ్గింది. ప్రతీక్ అథవాలే (57 నాటౌట్), కశ్యప్ ప్రజాపతి (50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో టీమ్‌ను గెలిపించారు.
అఖీబ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. మరో మ్యాచ్‌లో నేపాల్ 8 వికెట్ల తేడాతో అమెరికాపై నెగ్గింది. వ్రిత్య అరవింద్ (64) హాఫ్ సెంచరీతో అమెరికా 20 ఓవర్లలో 134/9 స్కోరు చేయగా, నేపాల్ 17.1 ఓవర్లలో 135/2 స్కోరు చేసింది. ఆసిఫ్ షేక్ (64 నాటౌట్), రోహిత్ పాడెల్ (34 నాటౌట్), గుల్షన్ ఝా (22) రాణించారు. ఆసిఫ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.