మోడీకి థాంక్స్ చెప్పిన నేపాల్ ప్రధాని

మోడీకి థాంక్స్ చెప్పిన నేపాల్ ప్రధాని

భారత ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా. ఉక్రెయిన్ నుంచి నలుగురు నేపాలీ జాతీయుల్ని క్షేమంగా తమ దేశానికి చేర్చినందుకు గాను మోడీకి థాంక్స్ చెప్పారు.  నలుగురు నేపాలీ జాతీయులు ఉక్రెయిన్ నుంచి భారత్ మీదుగా నేపాల్ చేరుకున్నారు. ఆపరేషన్ గంగా ద్వారా నేపాలీ జాతీయులను స్వదేశానికి రప్పించడంలో సహాయం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.. నేపాల్ ప్రధాని. 

మరోవైపు ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులందర్నీ స్వదేశానికి తరలించారు. ఆపరేషన్ గంగ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టి స్పెషల్ ఫైట్ల ద్వారా అక్కడున్న మనవారిని భారత్‌కు రప్పించారు. అయితే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు ప్రశంసించింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం గొప్ప చర్యలు చేపట్టిందని సంతృప్తిని వ్యక్తం చేసింది అత్యున్నత న్యాయస్థానం. భారతీయుల తరలింపు, సాయం కోసం హెల్ప్ డెస్కు ఏర్పాటు చేయాలన్న పిటిషన్ పై చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పందించింది. ఉక్రెయిన్ లో చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు బాధపై ఆందోళన వ్యక్తం చేసింది ఉన్నత న్యాయస్థానం.