అయోధ్య రాముడికి నేపాల్ సావనీర్లు


ఖాట్మండు: వచ్చే నెలలో జరగనున్న రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు నేపాల్ ప్రత్యేక సావనీర్లు పంపనుంది. వివిధ ఆభరణాలు, పాత్రలు, బట్టలు, స్వీట్లతో కూడిన సావనీర్లు అయోధ్యకు పంపనున్న ట్లు ఆదివారం అక్కడి ఓ మీడియా వెల్లడించింది. జనక్​పూర్ ధామ్​ నుంచి జనవరి 18న సావనీర్లతో ఓ బృందం బయలుదేరి 20న అయోధ్య ధామ్​కు చేరుకుంటుం దని పేర్కొంది. అదే రోజు సావనీర్‌‌ లను శ్రీరామజన్మభూమి ట్రస్టుకు అందజేస్తామని జానకి ఆలయ ఉమ్మడి మహంత్​ రాంరోషన్ దాస్ వైష్ణవ్ తెలిపారు.