T20 World Cup 2024: ఇసుకేస్తే రాలనంత జనం: ఆట కోసం పోటెత్తిన నేపాల్ అభిమానులు

T20 World Cup 2024: ఇసుకేస్తే రాలనంత జనం: ఆట కోసం పోటెత్తిన నేపాల్ అభిమానులు

నేపాల్ లో క్రికెట్ కు ఎంత క్రేజ్ ఉందో చాలా తక్కువ మందికే తెలుసు. అసోసియేట్ దేశమైనా, స్టార్ ప్లేయర్లు లేకున్నా.. ఆ దేశంలో క్రికెట్ ను ఆరాధిస్తారు. నేపాల్ ఏ దేశం మీదైనా మ్యాచ్ ఆడితే ఆ దేశ అభిమానులు భారీగా తరలివస్తారు. సరైన స్టేడియం లేకున్నా నిలబడి మ్యాచ్ చూస్తూ క్రికెట్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. కొన్ని సందర్భాల్లో క్రికెట్ లవర్స్ చెట్లు ఎక్కి మ్యాచ్ లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా టీ20 వరల్డ్ కప్ లో ఈ అభిమానం ఆకాశాన్ని దాటేసింది. 

వరల్డ్ కప్ లో భాగంగా మంగళవారం (జూన్ 4) నెదర్లాండ్స్, నేపాల్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నేపాల్ ను చిత్తు చేసిన నెదర్లాండ్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో నేపాల్ ఓడిపోయినా వార్తల్లో నిలిచింది. దానికి కారణం కారణం అభిమానులు భారీగా తరలి రావడమే. నేపాల్ ఎక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడినా పోటెత్తే జనం.. నిన్న వరల్డ్ కప్ లో అంతకు ముంచి అనేలా ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయడానికి వచ్చారు. గ్రౌండ్ మొత్తం నేపాల్ ఫ్లాగ్స్ పట్టుకొని వేళ్ళు చేసిన హంగామా ఈ మ్యాచ్ కు హైలెట్ గా నిలిచింది. 

నేపాలీ షర్టులు ధరించి స్టాండ్స్ లో సందడి చేశారు. ఇక స్టేడియానికి రాలేకపోయిన ఫ్యాన్స్ కు ఆ దేశంలో స్పెషల్ స్క్రీన్స్ వేయడం విశేషం. ఈ స్క్రీన్ దగ్గర మ్యాచ్ లు చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఇసుకేస్తే రాలనంత జనం మ్యాచ్ చూస్తూ కనిపించారు. క్రికెట్ లో పసికూనగా భావించే నేపాల్ దేశంలో క్రికెట్ పై ఇంత అభిమానం ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. నేపాల్‌ రాజధాని నగరమైన ఖాట్మండులో స్పెషల్ స్క్రీన్ పై మ్యాచ్ చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు వీక్షిస్తున్న ఫోటో వైరల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి వీరు మ్యాచ్ గెలిస్తే వీరి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో ఊహకే అంతు చిక్కడం లేదు.