చరిత్ర సృష్టించిన నేపాల్ జట్టు.. టీ20 హిస్టరీలోనే అత్యధిక స్కోర్

పసికూన జట్టుగా భావించే నేపాల్ క్రికెట్ జట్టు అంతర్జాతీయ టి20 క్రికెట్లో సరికొత్త రికార్డులు లిఖించింది. ఆసియా క్రీడల్లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో నిర్ణీత 20 ఓవర్లలో 314 పరుగులు చేసింది. ఇది అంతర్జాతీయ టి20లో అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడమే మంగోలియా జట్టు చేసిన అతి పెద్ద తప్పు. బ్యాటింగ్ దిగిన నేపాల్ బ్యాటర్లు మొదటలో కాస్త తడబడినా.. క్రీజులో కుదురుకున్నాక చెలరేగిపోయారు. ముఖ్యంగా ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ కుషాల్ మల్లా.. మంగోలియా బౌలర్ల పై దండయాత్ర చేశాడు.

19 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్న మల్లా.. ఆ తర్వాత మరింత చెలరేగాడు. బౌండరీల వర్షం కురిపిస్తూ 34 బంతుల్లోనే శతకం బాది రోహిత్ శర్మ దేవుడి మిల్లర్(34 బంతులలో) పేరిట ఉన్న గత రికార్డును అధిగమించాడు. అంతర్జాతీయ టి20ల్లో ఇది ఫాస్టెస్ట్ సెంచరీ కావడం గమనార్హం. మరో ఎండ్ నుంచి రోహిత్ పౌడెల్ (61; 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సులు), దేవేంద్ర సింగ్ ఐరీ(52; 10 బతుల్లో 8 సిక్సులు) కూడా బ్యాట్ ఝలిపించడంతో నిర్ణీత ఓవర్లలో నేపాల్ 314 పరుగులు చేసింది.