తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ కో-ఆర్డినేటర్ పదవి నుంచి బీఎస్పీ అధినేత్రి మాయావతి తొలగించిన విషయం తెలిసిందే. మేనత్త నిర్ణయంపై ఆకాశ్ ఆనంద్ స్పందించారు. మాయావతి.. బహుజన సమాజానికి మీరు రోల్ మోడల్ అని అన్నారు. కోట్లాది మంది దేశప్రజలు మిమ్మల్ని ఆరాధిస్తున్నారని తెలిపారు. మీ పోరాటాల వల్లనే ఈ రోజు మన సమాజానికి ఇంత రాజకీయ బలం వచ్చిందని వెల్లడించారు.
బహుజన సమాజం గౌరవంగా జీవించడం నేర్చుకుందని మీరే మా అధినేత్రి అని అన్నారు. తన చివరి శ్వాస వరకు భీమ్ మిషన్, బహుజన సమాజం కోసం పోరాడతాను అని ఎక్స్ లో తెలిపారు. ఇటీవల ఆకాశ్ ఆనంద్ బీజేపీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆకాశ్ రాజకీయంగా పరిణతి సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి దూరంగా ఉంచుతున్నట్లు మాయావతి ప్రకటించారు.
आदरणीय बहन @mayawati जी, आप पूरे बहुजन समाज के लिए एक आदर्श हैं, करोड़ों देशवासी आपको पूजते हैं। आपके संघर्षों की वजह से ही आज हमारे समाज को एक ऐसी राजनैतिक ताक़त मिली है जिसके बूते बहुजन समाज आज सम्मान से जीना सीख पाया है।
— Akash Anand (@AnandAkash_BSP) May 9, 2024
आप हमारी सर्वमान्य नेता हैं। आपका आदेश सिर माथे पे।…