భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. ఆపద ఉందంటే అప్పు ఇవ్వడమే అతని ప్రాణాన్ని బలిగొన్నది. అప్పుతీర్చమన్నందుకు మేనమామను మేనల్లుడే చంపిన ఘటన కొత్తగూడెంలోని మేదరబస్తీలో చోటుచేసుకుంది. మేదరబస్తీకి చెందిన అనీల్ కుమార్ కు సాయికుమార్ మేనల్లుడు. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో సాయికుమార్.. తన మేనమామ అనీల్ కుమార్ వద్ద రూ. 3 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత అనీల్ కుమార్ తనకు డబ్బులు అవసరమున్నాయని.. అప్పు తీర్చాలని కోరాడు. డబ్బులు ఎలా కట్టాలో అర్థంకానీ సాయికుమార్.. మేనమామ అనీల్ ను కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యుల పిర్యాదుతో ఘటనాస్థలానికి చేరుకున్న త్రీటౌన్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
For More News..