హైదరాబాద్, వెలుగు: ప్రైవేట్ ఈక్విటీ సంస్థ క్వాడ్రియా క్యాపిటల్ డయాలసిస్ నెట్‌వర్క్ అయిన నెఫ్రోప్లస్‌లో రూ. 850 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్టు ప్రకటించింది. ఈ లావాదేవీ ద్వారా మైనారిటీ వాటాను పొందుతుంది. 2010లో ఏర్పాటైన నెఫ్రోప్లస్ ఇండియాతోపాటు ఫిలిప్పీన్స్, ఇతర ఆసియా దేశాలలో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపింది. ఈ కంపెనీ ప్రముఖ నెఫ్రాలజిస్ట్‌లతో పని చేస్తూ హాస్పిటల్స్, క్లినిక్‌లలో డయాలసిస్ సెంటర్లను నిర్వహిస్తోంది.
పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ-–ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా సేవలు అందిస్తోంది. కంపెనీ టార్గెట్ మార్కెట్‌లలో డయాలసిస్ సేవలకు డిమాండ్ వచ్చే ఐదేళ్లలో ఏటా 11 శాతం పెరుగుతుందని అంచనా. తమ బిజినెస్వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఇప్పటి వరకు 30 వేల మంది పేషెంట్లకు డయాలసిస్ చేశామని నెఫ్రోప్లస్ ఫౌండర్విక్రమ్వుప్పల చెప్పారు. సంస్థకు ఇండియాలో 250 ప్రాంతాల్లో 450 సెంటర్లు ఉన్నాయని వివరించారు.