నేరడిగొండ కేజీబీవీలో మరోసారి పప్పులో పురుగులు

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో మరోసారి పప్పులో పురుగులు వచ్చాయి. డీఈఓ, సెక్టోరియల్ ఆఫీసర్ల సమక్షంలోనే వంటలు చేయించినా పప్పులో పురుగులు రావడంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బందిని మార్చాలని డిమాండ్ చేశారు. తమ సమక్షంలోనే వంటలు చేసినా పురుగులు రావడంతో డీఈఓ, సెక్టోరియల్ అధికారులు స్పందించి హాస్టల్ కి 3రోజులు సెలవు ప్రకటించాలని నిర్ణయించారు.

ఆదివారం ఫుడ్ పాయిజన్ కావడంతో 25 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఘటనపై  జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సెక్టోరియల్ ఆఫీసర్లు తనిఖీలు చేపట్టగా జిల్లా విద్యాశాఖ అధికారి కూడా హాస్టల్ కు వచ్చి విచారణ జరిపారు. అస్వస్థతకు గురై  హాస్టల్ లోనే చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.