జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు నేరడిగొండ క్రీడాకారులు

నేరడిగొండ, వెలుగు: నేరడిగొండ మండలానికి చెందిన క్రీడాకారులు జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు జిల్లా సాఫ్ట్ బాల్ ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగాధర్ తెలిపారు. ఇటీవల మండలంలో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ పోటీల్లో బాలికలు, నల్గొండ జిల్లాలో జరిగిన పోటీల్లో బాలురు జిల్లా స్థాయిలో పోటీపడి తృతీయ స్థానంలో నిలిచారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన మండలానికి చెందిన శ్రీలేఖ, హర్షిత, ఆరుషి, వెంకటేశ్, ఇంద్రజిత్ జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. వీరు మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో జరిగే పోటీల్లో తెలంగాణ జట్టు తరఫున పోటీపడుతారని తెలిపారు.
 
రాష్ట్ర సాఫ్ట్ బాల్ బాలికల జట్టు కోచ్​గా అఖిల

నేరడిగొండ మండలానికి చెందిన ఓరగంటి అఖిల రాష్ట్ర సాఫ్ట్ బాల్ బాలికల జట్టు కోచ్​గా ఎంపికైనట్లు రాష్ట్ర సాఫ్ట్ బాల్ ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్, శోభన్ బాబు తెలిపారు. అఖిల ఎన్ఐఎస్ సాఫ్ట్ బాల్ కోచ్​గా పంజాబ్​లో శిక్షణ పూర్తి చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్​లో జరగబోయే  36వ జాతీయస్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్​లో రాష్ట్ర సాఫ్ట్ బాల్ బాలికల జట్టుకు కోచ్​గా ఆమె ఎంపికైనట్లు తెలిపారు. క్రీడాకారులతోపాటు అఖిలను ఎమ్మెల్యే అనిల్ జాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు గోడం జ్యోతిరామ్, ప్రధాన కార్యదర్శి గస్కంటి గంగాధర్, అసోసియేషన్ సభ్యులు అభినందించారు.