చంపేస్తారా మమ్మల్ని : ఇండియాలో నాసిరకం సరుకు అమ్ముతున్న పెప్సీ, నెస్లీ కంపెనీలు

చంపేస్తారా మమ్మల్ని : ఇండియాలో నాసిరకం సరుకు అమ్ముతున్న పెప్సీ, నెస్లీ కంపెనీలు

దుర్మార్గుల్లారా.. ఏం పాపం చేశాంరా మేం.. మీ సరుకుతో మమ్మల్ని చంపేస్తారా.. మేం అంత లోకువా.. ఏం డబ్బులు కట్టి సరుకులే కదా తీసుకుంటుంది అంటూ ఇండియాలోని జనం అంతా ఇప్పుడు ఇలాగే గగ్గోలు పెడుతున్నారు.. తిట్టిపోస్తున్నారు.. దుమ్మెత్తిపోస్తున్నారు.. ఎవర్నీ అంటారా పెప్సీ, నెస్లీ వంటి అంతర్జాతీయ కంపెనీలను.. జనం ఇలా తిట్టటానికి కారణం లేకపోలేదు.. ఈ పెప్సీ, నెస్లీ కంపెనీలు.. నాసిరకం ఉత్పత్తులను భారత్ లో అమ్ముతున్నారంట.. ధనిక దేశాల్లో మాత్రం మంచి సరుకు అమ్ముతున్నారంట.. ఈ విషయం ఓ సర్వే సంస్థ వెలుగులోకి తీసుకురావటంతో.. ఇప్పుడు ఇండియాలో పెద్ద ఇష్యూ అయ్యింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

పెప్సీ, నెస్లీ, యూనిలీవర్ కంపెనీలు తయారు చేసి అమ్మే ఆహార ఉత్పత్తులకు రేటింగ్ ఉంటుంది. నాణ్యతను బట్టి ఆ రేటింగ్స్ ఇస్తారు. 5 స్టార్ రేటింగ్ లెక్కన తీసుకుంటే.. ఇండియా లాంటి తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో 1.8 స్కోర్ రేటింగ్ తో ఉన్న ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారంట.. అదే ఆస్ట్రేలియా, అమెరికా, యూకే వంటి ఆదాయ దేశాల్లో 2.3 స్కోర్ రేటింగ్ ఉన్న ఆహార ఉత్పత్తులను అమ్ముతున్నారంట.. ఓవరాల్ లో  అసలు విషయం ఏంటీ అంటే.. స్కోర్ రేటు 3.5 ఉంటేనే అత్యంత సురక్షితమైన ఆహారం కింద లెక్క. ఈ కంపెనీలు.. అంటే పెప్సీ, నెస్లీ, యూనిలివర్ కంపెనీలు ఏవీ కూడా ధనిక దేశాల్లోనూ 100 శాతం సురక్షితమైన ఆహార ఉత్పత్తులను విక్రయించటం లేదు అనే భయంకరమైన నిజం బయటపడింది. 

ఇండియాలో ఈ కంపెనీలు అమ్ముతున్న ఉత్పత్తుల రేటింగ్ ఎంటో తెలుసా 1.8.. అంటే నాసిరకం సరుకును అమ్ముతున్నారు. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు.. ATNI.. అంటే యాక్సెస్ టూ న్యూట్రిషన్ ఇనిషియేటివ్ అనే సంస్థ. గ్లోబల్ ఇండెక్స్ ప్రకారం పెప్సీ, నెస్లీ, యూనిలివర్ కంపెనీలు.. ఆయా దేశాల్లోని ప్రజల ఆదాయం, ఖర్చుల ఆధారంగా ఆహార ఉత్పత్తులు తయారు చేసి అమ్ముతున్నారంట.. 

ఇలాంటి ఆహార ఉత్పత్తులను తీసుకుంటున్న ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది ఈ సర్వే సంస్థ. ఇప్పటికే ప్రపంచంలో 100 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారని హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 70 శాతం మంది మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి, పేదలుగానే ఉన్నారని.. అలాంటి వారిపై అనారోగ్యం దాడి చేస్తుందని హెచ్చరించింది. ATNI నివేదిక ఆధారంగా ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి అనేది చూడాలి..