డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు @ రూ.11.25 లక్షల కోట్లు

డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు @ రూ.11.25 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని అక్టోబర్ 10 వరకు నికరంగా రూ.11.25 లక్షల కోట్ల డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లయ్యింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌లో వచ్చిన రూ.9.51 లక్షల కోట్లతో  పోలిస్తే 18.3 శాతం పెరిగింది. పర్సనల్ ట్యాక్స్ కింద రూ.5.98 లక్షల కోట్లు,  కార్పొరేట్ ట్యాక్స్ కింద రూ.4.94 లక్షల కోట్లను ప్రభుత్వం సేకరించగలిగింది.   సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ (ఎస్‌‌‌‌‌‌‌‌టీటీ) ద్వారా రూ.30,630 కోట్లు, ఇతర డైరెక్ట్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ల (ఈక్వలైజేషన్ లెవీ, గిఫ్ట్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌లు కూడా కలిపి) ద్వారా రూ.2,150 కోట్లు వసూలు చేసింది.

  గ్రాస్ లెవెల్‌‌‌‌‌‌‌‌లో  డైరెక్ ట్యాక్స్ కింద రూ.13.57 లక్షల కోట్లు వసూళ్లయ్యాయి.   రూ.2.31 లక్షల కోట్లను ప్రభుత్వం రిఫండ్ చేసింది. ఇది కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఏప్రిల్ 1– అక్టోబర్ 10 మధ్య ఇచ్చిన రిఫండ్స్‌‌‌‌‌‌‌‌తో  పోలిస్తే 46 శాతం ఎక్కువ. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.22.07 లక్షల కోట్లను డైరెక్ట్ ట్యాక్స్ ద్వారా సేకరించాలని కేంద్రం టార్గెట్ పెట్టుకుంది.