పెరిగిన డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ వసూళ్లు

పెరిగిన డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ వసూళ్లు

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.9.95 లక్షల కోట్ల డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్ (నెట్‌‌‌‌‌‌‌‌) వసూళ్లయ్యింది. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 16.12 శాతం పెరిగింది. అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ పెరగడంతో ట్యాక్స్ వసూళ్లు పుంజుకున్నాయి. ప్రభుత్వం రూ.2.05 లక్షల కోట్ల విలువైన రిఫండ్స్‌‌‌‌‌‌‌‌ను క్లియర్ చేసింది. ఇది ఏడాది ప్రాతిపదికన 56.49 శాతం ఎక్కువ. 

డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లలో పర్సనల్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌ వసూళ్లు నికరంగా రూ.5.15 లక్షల కోట్లుగా ఉన్నాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలోని ఇదే టైమ్‌‌‌‌‌‌‌‌తో పోలిస్తే 19 శాతం వృద్ధి సాధించాయి.  కార్పొరేట్ ట్యాక్స్ కలెక్షన్‌‌‌‌‌‌‌‌  10‌‌‌‌‌‌‌‌.55 శాతం పెరిగి రూ.4.52 లక్షల కోట్లుగా రికార్డయ్యింది.