గాజాతో యుద్దంతో చేలరేగిన చిచ్చు..హిబ్జుల్లా సరిహద్దుల్లో లెబనాన్, ఇజ్రాయెల్ భీకర పోరు..బాంబుల వర్షం.. రాకెట్ల దాడి.. నేలమట్టమైన భవనాలు.. ఛిద్రమైన శరీరాలు. కనివినీ ఎరుగని విధ్వం సం..1500 మందికిపైగా మృతి..అంతకుమించి క్షతగాత్రులు..లక్షా 18వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇది నేటి లెబనాన్ పరిస్థితి.
లెబనాన్ పై కాల్పుల విరమణకు ప్రపంచ దేశాలు పిలుపులు..లెబనాన్ లో 21 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్కు మద్దుతు దేశమైన అమెరికాకు కూడా పిలుపునిచ్చింది. అయినా పట్టించుకోని ఇజ్రాయెల్.. మాటల్లేవు..మాట్లాడుకోవడాల్లేవ్.. ఇక చంపుడే లెక్క అని ఇజ్రాయెల్ లెబనాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
హుబ్జుల్లా దళ కమాండర్లను ఒక్కొక్కరుగా హతమారుస్తున్నఇజ్రాయెల్..గురువారం లెబనాన్ కు చెందిన మరో కమాండర్ ను చంపింది. ఇజ్రాయెల్ మిలిటరీ తన ఫైటర్ జెట్లతో హిజ్బుల్లా కమాండర్ మహ్మద్ హుస్సేన్ స్రోర్ ను టార్గెట్ చేసి హతమార్చింది. ఇరాన్ మద్దతు గల హిజ్జుల్లా సభ్యులే లక్ష్యంగా ఇది నాలుగో దాడి.
ALSO READ : పుతిన్ వార్నింగ్..మా శత్రువుకు ఆయుధాలిస్తే.. మీపై అణుబాంబులు వేస్తాం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గురువారం (సెప్టెంబర్ 26)న యూఎస్, ఫ్రాన్స్, ఇతర మిత్ర దేశఆలు 21రోజులు కాల్పుల విమరణకు పిలుపునిచ్చాయి.. అయితే నెతన్యాహు మిత్రదేశాల పిలుపును తిరస్కరించారు. లెబనాన్ పై పూర్తి స్థాయి సైనిక శక్తిని వినియోగించాలని తన దళాలకు ఆదేశించారు.
మేం మాటలతో కాకుండా చేతలతో మాట్లాడతాం..అని సోషల్ మీడియా ద్వారా లెబనాన్ కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.