అమెరికా ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ఓకే: నెతన్యాహు సలహాదారు

గత 8 నెలలుగా మారణహోమం సృష్టించిన ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్దానికి తెరపడనుందా..గాజాపై యుద్దాన్ని ముగించేం దుకు ఇజ్రాయెల్ ఎట్టకేలకు ఒప్పుకుం దా..అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ చేసిన ప్రతిపాదనకు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు అంగీకరించారని నెతన్యాహు ప్రధాన విదేశీ పాలసీ సలహాదారు ఓఫిర్ ఫాక్ తెలిపారు.  ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ యుద్ద విరమణ, గాజా పునర్మాణం ఉన్నాయి.

‘‘అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రతిపాదనలను ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజిమన్ నెతన్యాహు అంగీకరించారని బెంజిమన్ వ్యక్తిగత సహాయకుడు ఆదివారం (జూన్ 2) ధృవీకరించారు. ప్రతిపాదన సరియైనది కాకపోయినా.. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వారికోసం ఈ  ప్రతిపాదన ఒప్పుకున్నట్లు తెలిపారు.  

మే 31న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ..ఇజ్రాయెల్, హమాస్ సైనిక  ఉపసంహరణ, ఆరు వాలరాల కాల్పుల విరమణతో కూడిన ఒప్పందాన్ని ప్రతిపాదించింది.