
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ తమ సబ్స్క్రైబర్స్ కి హెచ్చరికలు జారీ చేసింది. ఇందులోభాగంగా నెట్ ఫ్లిక్స్ పేరుతో వచ్చేటువంటి స్పామ్ ఈమెయిల్స్ ని ఓపెన్ చెయ్యద్దని సూచించింది.. ఒకవేళ నెట్ ఫ్లిక్స్ పేరుతో వచ్చిన ఫేక్ ఈమెయిల్స్ ని క్లిక్ చేస్తే క్రెడిట్ కార్డు లావాదేవీలు, ఓటీపీ, నగదు చెల్లింపులు వంటి డేటా స్కామర్స్ చేతికి చిక్కే అవకాశం ఉందని కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈ హెచ్చరికలని సైబర్ సెక్యూరిటీ కంపెనీ ESETలోని గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అడ్వైజర్ నుండి జారీ చేసింది.
అలాగే "మీ నెట్‌ఫ్లిక్స్ ఖాతా ఇమెయిల్, ఫోన్, పాస్‌వర్డ్ లేదా చెల్లింపు పద్ధతిని అడుగుతూ మీకు ఇమెయిల్ లేదా టెక్స్ట్ సందేశం (SMS) వస్తే అది బహుశా నెట్‌ఫ్లిక్స్ నుండి రాకపోవచ్చు.. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ నుంచి మీ వ్యక్తిగత వివరాలు సేకరించే ఫోన్ కాల్స్ లేదా ఈమెయిల్స్ రావని" అని నెట్‌ఫ్లిక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇక పేమెంట్స్ చేసే సమయంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని, ఈమధ్య ఏఐ తో నకిలీ పేమెంట్ పేజీలు క్రియేట్ చేసి సులభంగా ఆర్ధిక మోసాలకు పాల్పడుతున్నారని కాబట్టి పేమెంట్స్ చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరింది.
ఇంకొందరు అతి తెలివిగా నెట్ఫ్లిక్స్ లోగో ని ఉపయోగించి "మీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ ని ఇప్పుడే అప్డేట్ చేసేందుకు ఇక్కడ క్లిక్ చెయ్యండి అంటూ లింకులు పంపిస్తారని ఇలాంటి లింకులపై క్లిక్ చెయ్యకండి అని సూచించింది. ఇలాంటి లింకులపై క్లిక్ చేయడం వలన ఒక్క క్లిక్ తో మీ డేటా మొత్తం హ్యాకర్స్ చేతికి వెళ్ళిపోతుందని తెలిపింది.