టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్ గా చెరగని ముద్ర వేశారు దర్శక ధీరుడు రాజమౌళి (SS Rajamouli). బాహుబలితో పాన్ ఇండియా ఫార్ములాను తెరమీదకు తీసుకొచ్చిన దర్శక ధీరుడు రాజమౌళి పురాణాల కథలనే మార్వెల్ మూవీస్ తరహాలో తెరపైకి తీసుకురాగలిగే టాలెంట్ ఉన్న డైరెక్టర్ రాజమౌళి.
ఇపుడు ‘బాహుబలి’,‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలతో లతో ప్రపంచాన్ని ఆకర్షించిన రాజమౌళిపై నెట్‌ఫ్లిక్స్ అరుదైన ఓ డాక్యుమెంటరీ రూపొందించింది. అయితే ఈ డాక్యుమెంటరీకి స్ట్రీమింగ్ కి సంబంధించిన వివరాలను తాజాగా (Netflix) పోస్ట్ పెట్టింది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ డాక్యుమెంటరీ ‘మోడ్రన్ మాస్టర్స్’ టైటిల్ తో తీసుకువస్తున్నట్లు తెలిపారు.
ఇందులో రాజమౌళి విజన్,తన విభిన్నమైన మేకింగ్ స్టైల్,అతను సినిమా తీయడం కోసం తేరా వెనక పడే కష్టాన్ని చూపించనున్నారు. ‘ఒక మేకర్ నుంచి అనేక బ్లాక్‌బస్టర్‌లు, అతని అంతులేని ఆశయం, పడే తపన ఎలాంటిదో..ఇంతలా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారు? ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇలాంటి విభిన్న అంశాలతో ‘మోడ్రన్ మాస్టర్స్’ రూపుదిద్దుకుంది.
అనుపమా చోప్రా రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ ఆగస్టు2 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.ఈ డాక్యుమెంటరీకి రాఘవ్ ఖన్నా దర్శకత్వం చేస్తుండగా తన్వి అజింక్యా సహ దర్శకత్వం వహిస్తున్నాడు.అయితే,ఇందులో తెలుగు సినిమా నటుల నుండి అంతర్జాతీయ నటుల వరకు రాజమౌళిపై వారికి ఉన్న తమ అభిప్రాయాలను తెలియజేయనున్నారు.ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్(RRR) వంటి గ్లోబల్ హిట్ తరువాత మహేష్ బాబుతో (SSRMB29) ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను రూ.1000 కోట్లకు పైగా బడ్జెట్ తో పట్టాలెక్కిస్తున్నారు.ఇప్పటికే కథ సిద్ధం అవగా..ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక రాజమౌళి కూడా హాలీవుడ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ప్రతీ చిన్న విషయంలో కేర్ తీసుకుంటున్నాడు.
నటీనటుల విషయంలో కూడా అదే రేంజ్ ను మైంటైన్ చేస్తున్నాడట. అందులో భాగంగానే ఈ సినిమాలో మహేష్ కు విలన్ గా ఓ స్టార్ హీరోను సెట్ చేయనున్నాడట. ఆ స్టార్ మరెవరో కాదు మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్. ఇప్పటికే ఈ పాత్ర కోసం పృథ్విరాజ్ తో సంప్రదింపులు కూడా జరిపారట మేకర్స్. పాత్ర నచ్చడం, అది కూడా హాలీవుడ్ రేంజ్ మూవీ కావడం, అందులోను రాజమౌళి డైరెక్టర్ అవడంతో వెంటనే ఒకే చెప్పేశాడట పృథ్విరాజ్.