జక్కన్న జైత్రయాత్రపై డాక్యుమెంటరీ

జక్కన్న జైత్రయాత్రపై డాక్యుమెంటరీ

‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఇండియన్‌‌‌‌ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లి.. ఆస్కార్‌‌‌‌‌‌‌‌కు చేరువ చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ‘స్టూడెంట్ నంబర్ 1’ చిత్రం  మొదలు దర్శకుడిగా ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ అందుకున్న విజయాలు, ఒక్కో విజయం కోసం ఆయన పడ్డ తపన, కష్టం తెలుగు ప్రేక్షకులకు  తెలిసిందే. ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ సవివరంగా తెరపై చూపించబోతోంది నెట్‌‌ఫ్లిక్స్ సంస్థ. 

జక్కన్న సినీ జీవితంపై ఓ డాక్యుమెంటరీ వస్తోంది. మోడర్న్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌ ఎస్‌‌‌‌.ఎస్‌‌‌‌.రాజమౌళి పేరుతో తెరకెక్కుతున్న ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది.  శనివారం ఈ విషయాన్ని నెట్‌‌‌‌ ఫ్లిక్స్ ప్రకటించింది.  ‘ఒక మనిషి.. ఎన్నో విజయాలు.. అంతులేని ఆశయం. లెజెండరీ ఫిల్మ్ మేకర్‌‌‌‌‌‌‌‌గా శిఖరాగ్రాలను ఎలా చేరుకున్నారు.. ’ అనేది ఇందులో చర్చించబోతున్నట్టు తెలియజేసింది. రాజమౌళి గురించి ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటి హీరోలతో పాటు ప్రముఖుల పాయింట్ ఆఫ్‌‌‌‌ వ్యూని ఇందులో చూపించనున్నట్టు తెలుస్తోంది.