![Mr. Bachchan OTT: రవితేజ మిస్టర్ బచ్చన్ ఓటీటీ డీల్ కంప్లీట్!..స్ట్రీమింగ్ హక్కులు ఏ ప్లాట్‍ఫామ్ తీసుకుందంటే?](https://static.v6velugu.com/uploads/2024/07/netflix-ott-has-acquired-the-ott-digital-streaming-rights-of-ravi-tejas-mr-bachchan-movie_sVTMXbYqfy.jpg)
మాస్ మహారాజా రవితేజ (Raviteja) హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ (Harish Shankar)లో తెరకెక్కుతున్న చిత్రం మిస్టర్ బచ్చన్ (Mr.Bachchan).ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, ఈ సినిమా థియేట్రికల్ రన్ తర్వాత ఎ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి వస్తుందనేది ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెరిగింది. కాగా ఈ సినిమా హక్కులను ప్రముఖ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ దక్కించుకుందని సమాచారం.
రవితేజ మాస్ ఆడియన్స్ లో పెంచిన పల్స్ రేట్ కి తగ్గట్టుగానే బచ్చన్ స్ట్రీమింగ్ కి మంచి రేటే పలికినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మిస్టర్ బచ్చన్ ఆగష్టు 15న థియేటర్లలో రిలీజ్ అయ్యాక..సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో స్ట్రీమింగ్‍కు తెచ్చేలా కూడా నెట్‍ఫ్లిక్స్ ప్లాన్ చేస్తోందనిసినీ సర్కిల్లో టాక్. ఏదేమైనా రవితేజ మాస్ కి తగ్గుట్టుగానే ఓటీటీ ధరలు ఉండగా..మరి థియేటర్స్ ఆడియన్స్ ను ఎలా మెప్పిస్తుందో చూడాలి. త్వరలో నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది
ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే..పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, అయనంకా బోస్ కెమెరా బాధ్యతలు చేపట్టారు.రవితేజకి జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది.చాలా ఫాస్ట్గా సినిమాను కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.