వాషింగ్టన్ డీసీ: ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ తమ వినియోగదారులపై అదనపు ఛార్జీలు వేసేందుకు సిద్ధమవుతోంది. ఒకే అకౌంట్ పాస్ వర్డ్‌ను ఎక్కువ మందికి షేర్ చేసి.. లాగిన్‌లో ఉన్న డివైజ్‌ల సంఖ్య పెరిగితే అదనపు ఛార్జీలు వేయాలని నెట్ ఫ్లిక్స్ యోచిస్తోంది. పాస్ వర్డ్‌ను షేర్ చేసే ప్రైమరీ అకౌంట్ హోల్డర్స్ నుంచి ఈ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ దిశగా చెలీ, కోస్టారికా, పెరూ దేశాల్లో ఇప్పటికే టెస్ట్ రన్ మొదలుపెట్టింది. ఆయా దేశాల్లో ఒకే అకౌంట్‌తో ఎక్కువ డివైజ్‌లలో లాగిన్ చేసిన వారిని గుర్తించి.. ప్రతి నెలా రెండు నుంచి మూడు అమెరికన్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.150 నుంచి రూ.225) వరకు అదనపు ఛార్జీలను వసూలు చేయాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించింది.
‘ఒకేచోట కలసి ఉండే వారి కోసం అకౌంట్లను షేర్ చేసుకునేందుకు మేం అవకాశం కల్పించాం. ప్రత్యేక ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుని మొబైల్, టీవీ, కంప్యూటర్లలో స్ట్రీమింగ్ చేసుకునేందుకు స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను ఏర్పాటు చేశాం. వీటికి ఎంతగా పాపులారిటీ వచ్చిందో.. అకౌంట్ల షేరింగ్ విషయంలో అంతే కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. మరిన్ని అద్భుతమైన సినిమాలను మా మెంబర్లకు అందించడంపై ఇది ప్రభావం చూపిస్తోంది’ అని నెట్ఫ్లిక్స్ లో ప్రొడక్షన్ ఇన్నోవేషన్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న చెంగ్యీ లాంగ్ అన్నారు.
Netflix plans to start testing a fee for customers who share their passwords outside their households
— ANI Digital (@ani_digital) March 17, 2022
Read @ANI Story | https://t.co/r6ly5Kaw1R#Netflix #testing pic.twitter.com/1PZeS01jzb
ఇకపై స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్స్ కలిగిన సబ్ స్క్రైబర్లకు నెట్ఫ్లిక్స్ సబ్ అకౌంట్స్ అనే ఫీచర్ ను ఏర్పాటు చేసింది. ఈ ఫీచర్ లో సెపరేట్ లాగిన్, ప్రొఫైల్, పర్సనల్ రికమెండేషన్స్ ఉంటాయి. సబ్ అకౌంట్స్ ను ఎనేబుల్ చేసేందుకు మెయిన్ అకౌంట్ ఓనర్ తమ మెయిల్ ఐడీ నుంచి కోడ్ ను కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తల కోసం: