Netflix Top Movies: నెట్‌ఫ్లిక్స్ ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్ లిస్ట్ రిలీజ్

నెట్‌ఫ్లిక్స్(Netflix)లో సినిమా వస్తుందంటే..ఆ సినిమాలో ఏదో బలమైన సందేశం ఐనా..ఎవ్వరికీ తెలియని ఇన్ఫర్మేషన్ ఐనా ఉండేలా స్ట్రాంగ్ బెస్ మెంట్ ఏర్పాటు చేసుకుంది. తెలుగు, బాలీవుడ్, హాలీవుడ్, కొరియన్, స్పానిష్ అంటూ ఒక భాష, ప్రాంతీయతతో, దేశం సంబంధం లేకుండా అన్ని రకాల మూవీస్, వెబ్ సిరీస్ ఉండటం నెట్‌ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ ప్రత్యేకత.

ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్లో క్రైమ్ సస్పెన్స్, యాక్షన్ థ్రిల్లర్స్, డ్రామా ఓరియెంటెడ్ ఇలా ప్రతో జోనర్ ఇష్టపడే వాళ్లకి మూవీస్ అందుబాటులో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ప్రతివారం గ్లోబల్, ఇండియా టాప్ ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్ లిస్టు రిలీజ్ చేస్తూ ఉంటుంది.

ALSO READ | Game Changer: మొదలైన గేమ్ ఛేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్.. ఇప్పటికే అక్కడ ఒక షో టికెట్లు సేల్

లేటెస్ట్గా నెట్‌ ఫ్లిక్స్ ఈ వారం (డిసెంబర్ 4 నుంచి 10 వరకు) రిలీజైన.. ఇండియన్ టాప్ 10 ట్రేండింగ్ మూవీస్,వెబ్ సిరీస్ లిస్ట్ అనౌన్స్ చేసింది. ఇందులో ఫస్ట్ ప్లేస్లో అమరన్ మూవీ నిలిచింది. ఈ మూవీ డిసెంబర్ 5న నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి వచ్చింది. కేవలం నాలుగు రోజుల్లోనే టాప్ 1 లోకి రావడం విశేషం. ఈ మూవీ రాకముందు లక్కీ భాస్కర్ ఉండేది. ఇపుడు అమరన్ ఆ స్థానంలో నిలిచింది. 

నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్

1. అమరన్

2. లక్కీ భాస్కర్

3. విక్కీ ఔర్ విద్యా కా వో వాలా వీడియో

4. జిగ్రా

5. సికందర్ కా ముకద్దర్

6. దేవర

7. మేరీ

8. దట్ క్రిస్మస్

9. దో పత్తి

10. మేయళగన్ (సత్యం సుందరం)