
టెక్సాస్: టీ20 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ జట్టు బోణీ చేసింది. మంగళవారం అర్ధరాత్రి వరకు జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో నేపాల్‌పై విజయం సాధించింది. తొలుత నేపాల్ 19.2 ఓవర్లలో 106 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ పాడెల్ (37) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డచ్ బౌలర్లలో టిమ్ ప్రింగిల్ (3/20), లోగాన్ వాన్ బీక్ (3/18) చెరో మూడు వికెట్లు తీశారు. అనంతరం నెదర్లాండ్స్ 18.4 ఓవర్లలో 109/4 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఓపెనర్ మాక్స్ ఒడౌడ్ (54 నాటౌట్) ఫిఫ్టీతో సత్తా చాటాడు. ప్రింగిల్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.