వరల్డ్ కప్ లో నిలవాలంటే చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచులో నెదర్లాండ్స్ జట్టు బ్యాటింగ్ లో నిరాశపరించింది. బంగ్లా బౌలర్లు విజ్రంభించడంతో డచ్ వద్ద సమాధానం లేకుండా పోయింది. కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో బంగ్లా బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యం చెలాయించి స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు సిద్ధమైంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్కాట్ ఎడ్వార్డ్స్ 89 బంతుల్లో 6 ఫోర్లతో 68 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. బారేసి(41), సైబ్రాండ్ (35) పర్వాలేదనిపించారు. ఈ ముగ్గురు మినహా మిగిలిన బ్యాటలర్లందరూ విఫలమయ్యారు.క్రమం తప్పకుండా నెదర్లాండ్స్ వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ కుదురుకున్నట్టు కనిపించలేదు.
చివర్లో వాన్ బీక్ 16 బంతుల్లోనే 23 పరుగులు చేసి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోర్ ను అందించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో షోరీఫుల్ ఇస్లాం, ముస్తాఫిజార్ రహమాన్, తస్కిన్ అహ్మద్ కు తలో రెండు రెండు వికెట్లు తీసుకోగా.. షకీబ్, మెహదీ హాసన్ మిరాజ్ కు చెరో వికెట్ లభించింది. ఇక ఇప్పటికే ఈ టోర్నీలో నాలుగు పరాజయాలు చవి చూసిన ఇరు జట్లు ఈ మ్యాచ్ లో ఓడిపోతే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.