హరారే: విక్రమ్ జీత్ సింగ్ (110) కెరీర్లో తొలి సెంచరీతో సత్తా చాటడంతో వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో నెదర్లాండ్స్ మొదటి విజయం సాధించింది. సోమవారం వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ డక్‌వర్త్ పద్ధతిలో 74 రన్స్ తేడాతో ఒమన్‌ను ఓడించింది. తొలుత నెదర్లాండ్స్ నిర్ణీత 48 ఓవర్లలో 362/7 స్కోరు చేసింది.
విక్రమ్‌తో పాటు వెసెల్లే బరేసి (97) కూడా రాణించాడు. అనంతరం ఒమన్ టార్గెట్‌ను 44 ఓవర్లలో 321 రన్స్‌గా సవరించారు. ఛేజింగ్‌లో 44 ఓవర్లు ఆడిన ఓవన్ 246/6 స్కోరు మాత్రమే చేసి ఓడింది. అయాన్ ఖాణ్ (105 నాటౌట్) సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. విక్రమ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.