వన్డే ప్రపంచ కప్ జట్టుని ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగు కుర్రాడికి చోటు

వన్డే ప్రపంచ కప్ జట్టుని ప్రకటించిన నెదర్లాండ్స్.. తెలుగు కుర్రాడికి చోటు

వన్డే ప్రపంచ కప్ కి మరో నెల రోజుల సమయం కూడా లేదు. ఈ నేపథ్యంలో జట్లన్నీ తన స్క్వాడ్ లని ప్రకటించేస్తున్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా ఇప్పటికే 15 మందితో కూడిన జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా నెదర్లాండ్స్ వరల్డ్ కప్ స్క్వాడ్ కూడా వచ్చేసింది. ఈ మెగా ఈవెంట్ ఆడే 15 మంది సభ్యుల పేర్లను వెల్లడించింది. ఈ మేరకు మరో ఇద్దరు రిజర్వ్ ప్లేయర్లను కూడా ఎంపిక చేసింది. స్కాట్ ఎడ్వర్డ్స్ ఈ  జట్టుకి సారధ్యం వహించనున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో సంచలన విజయాలను నమోదు చేసి ఈ మెగా ఈవెంట్ కి అర్హత సాధించిన నెదర్లాండ్స్ ని తేలికగా తీసుకుంటే ప్రమాదమే.    
 
తెలుగు కుర్రాడికి వరల్డ్ కప్ లో చోటు

నెదర్లాండ్స్ వరల్డ్ కప్ జట్టులో తేజ నిడమానూరు చోటు దక్కింది. ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడకు చెందిన తేజ న్యూజిలాండ్ లో పెరిగి నెదర్లాండ్స్ జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచులో వెస్టిండీస్ జట్టు మీద వీరోచిత సెంచరీ చేసిన తేజ అందరి దృష్టిలో పడ్డాడు. ఈ మ్యాచులో 374 పరుగుల లక్ష్యాన్ని కూడా తెలుగు కుర్రాడి ఇన్నింగ్స్ తో నెదర్లాండ్స్ సంచలన విజయం సాధించింది. మొత్తానికి ఒక తెలుగు కుర్రాడు మన సొంత గడ్డపై ఆడుతుండడం చెప్పుకోదగ్గ విషయం. ఇక సీనియర్ ప్లేయర్లు అకేర్ మ్యాన్, రోల్ఫ్ వండెర్ మెర్వ్ కూడా వరల్డ్ కప్ జట్టులో స్థానం సంపాదించారు.   

ALSO READ : రూ.85 వేలకు చేరనున్న కిలో వెండి

నెదర్లాండ్స్ జట్టు:
స్కాట్ ఎడ్వర్డ్స్ (సి), మాక్స్ ఓ'డౌడ్, బాస్ డి లీడ్, విక్రమ్ సింగ్, తేజా నిడమనూరు, పాల్ వాన్ మీకెరెన్, కోలిన్ అకెర్‌మాన్, రోలోఫ్ వాన్ డెర్ మెర్వే, లోగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ర్యాన్ క్లైన్, వెస్లీ బరేసి, సకిబ్ బరేసి జుల్ఫికర్, షరీజ్ అహ్మద్, సిబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్.