సాధారణంగా పసికూనలపై చెలరేగే పాకిస్థాన్ టీం వరల్డ్ కప్ లో నెదర్లాండ్స్ తో మాత్రం ఆ స్థాయి ప్రదర్శన చూపించలేకపోయింది. బ్యాటింగ్ కి స్వర్గధామంగా ఉన్న హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో కనీసం 300 మార్క్ కూడా దాటలేకపోయింది. ఇదంతా పక్కన పెడితే 50 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేయలేక ఒక మాదిరి స్కోర్ ని డచ్ ముందు నిర్ధేశించింది.
వరల్డ్ కప్ లో భాగంగా నేడు రెండో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన పాకిస్థాన్ జట్టు ప్రారంభంలోనే ఫకర్ జమాన్ వికెట్ ని కోల్పోయింది. ఆ వెంటనే బాబర్(5), ఇమాముల్ హక్ (15) కూడా ఔటవ్వడంతో 38 పరుగులకే టాపార్డర్ పెవిలియన్ కి క్యూ కట్టారు. ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు రిజవాన్(68), సౌద్ షకీల్ (68) ఆదుకున్నారు. చివర్లో షాదాబ్(32), నవాజ్ (39) రాణించడంతో 49 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది.
నెదర్లాండ్స్ బౌలర్లలో బేస్ డీ లీడ్ కు 4, ఆకేరు మెన్ కి 2 వికెట్లు దక్కాయి. ఇక లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. మ్యాక్స్ ఓ డౌడ్ 5 పరుగులు చేసి హసన్ అలీ బౌలింగ్ లో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజ్ లో విక్రమ్ జీత్ సింగ్ (21), కొలిన్ ఆకేరు మెన్(0) ఉన్నారు.