ఖమ్మం టౌన్, వెలుగు: సప్లై ఎక్కువగా ఉండి, డిమాండ్ తక్కువగా ఉన్న పంట ఉత్పత్తులను ఆన్లైన్లో అమ్మేందుకు రైతులకు ఓ వేదిక ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాలను పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ విలేజ్ లోని డీసీసీబీను నెదర్లాండ్ రాబో బ్యాంకు మాస్టర్ కార్డు, బెయర్ భాగస్వామ్య బృందం శుక్రవారం సందర్శించారు.
నాగులవంచ రైతులు ఎక్కువగా పండించే వరి, మిర్చి, పత్తి పంట ఉత్పత్తుల గురించి డీసీసీబీ సీఈవో అట్లూరి వీరబాబు నెదర్లాండ్ బృందానికి వివరించారు. పంట ఉత్పత్తులను సొసైటీ ద్వారా ఆన్లైన్ పోర్టల్లో పెట్టి రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విషయాలను నెదర్లాండ్ బృందం వివరించింది. అనంతరం బృందాన్ని డీసీసీబీ స్టాఫ్ సత్కరించారు.