కాంగ్రెస్​ గూటికి నేతి.. రాహుల్​గాంధీ సమక్షంలో చేరిక!

  • కాంగ్రెస్​ గూటికి నేతి..  రాహుల్​గాంధీ సమక్షంలో చేరిక! 
  • కట్టంగూరు, నకిరేకల్​ ఎంపీపీలతో సహా పలువురు నేతలు ఢిల్లీకి

నల్గొండ, వెలుగు: శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్​ నేతి విద్యాసాగర్​ శుక్రవారం కాంగ్రెస్​లో చేరనున్నారు. ఆయనతోపాటు నకిరేకల్​ నియోజకవర్గంలోని కట్టంగూరు, నకిరేకల్​ఎంపీపీలు బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్​ రావు, జెల్లా ముత్తు లింగం తదితరులు గురువారం బీఆర్ఎస్​కు రాజీనామా చేశారు. వీరందరూ శుక్రవారం ఢిల్లీలో రాహుల్​గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలిసింది. 

ఆయన బీఆర్ఎస్​లోనే కొనసాగేందుకు మంత్రి జగదీశ్​​రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్​ను కూడా ఇటీవల కలిశారు. మూడోసారి అధికారంలోకి వస్తే మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తామని కేటీఆర్​ హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయ్యాక మళ్లీ కొనసాగిస్తారని అనుకున్నారు. కానీ, సీఎం అపాయిట్మెంట్​ ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పటి నుంచి విద్యాసాగర్​ బీఆర్ఎస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

 స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో రాజకీయ వైరుధ్యం ఆయన్ని మరింత కలిచివేసింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కాంగ్రెస్​లోని పలువురు పెద్దలతో చర్చలు జరిపిన అనంతరం విద్యాసాగర్​ కాంగ్రెస్​లో చేరాలని నిర్ణయించుకున్నారు.