- గాంధీ డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ కుటుంబసభ్యులు వేడుకోలు
- ట్రీట్ మెంట్ చేస్తున్నామని ఆస్పత్రి సూపరింటెండెంట్ వివరణ
పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు పట్టించుకోవడం లేదంటూ పేషెంట్ కుటుంబసభ్యులు పెట్టిన మెసేజ్సోషల్మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి డాక్టర్లు స్పందించారు. ఏపీలోని కపిలేశ్వపురం మండలం తాటిపూడికి చెందిన ఇల్ల శ్రీనివాస్, సుశీల దంపతులు సిటీకి వచ్చి అంబర్‌పేట తిరుమల నగర్లో ఉంటున్నారు. ఈనెల18న ఉదయం శ్రీనివాస్ కూతురు జ్యోతి(25) ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్లోని నాలుగో ఫ్లోర్‌నుంచి జారీ కిందపడింది. దీంతో ఆమె తల, వెన్నెముక, కాళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్చేసుకుని ట్రీట్ మెంట్ చేస్తున్నారు.
ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి ఉండగా డాక్టర్లు సమ్మెలో ఉన్నామని చెబుతున్నారని, ఏపీకి చెందినవాళ్లమని ఆరోగ్యశ్రీ కూడా వర్తించదంటున్నారని పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్సోమవారం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కోల్ కతాలో చనిపోయిన డాక్టర్కూడా తమ కూతురు లాంటిదేనని, ఇక్కడ కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన కూతురును బతికించండి అంటూ వేడుకున్నారు. వెంటనే ఆస్పత్రి న్యూరో సర్జన్డాక్టర్లు స్పందించి పేషెంట్ కు ట్రీట్ మెంట్ ప్రారంభించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్రాజకుమారిని సంప్రదించగా, పేషెంట్ ఇంకా షాక్‌లోనే ఉందన్నారు. ఆరోగ్యశ్రీ వర్తించనప్పటికీ సమస్య లేదన్నారు. పేషెంట్ కు ట్రీట్ మెంట్ చేయడంలో డాక్టర్ల నిర్లక్ష్యం లేదన్నారు.