సోషల్ మీడియా వాడకం పెరిగాక స్టార్స్ కి ఆడియన్స్ కి మధ్య దూరం బాగా తగ్గిపోయింది. ఎవరు ఎవరికైనా డైరెక్ట్ మెసేజెస్ చేస్తున్నారు. అడగాలనుకున్నది డైరెక్ట్ అడిగేస్తున్నారు. అతేంకాదు తమ తమ సినిమాల అప్డేట్ కోసం కూడా మెసేజెస్ చేస్తూ స్టార్స్ ను ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది కూడా తమపైన అభిమానంతోనే కదా అని స్టార్స్ కూడా లైట్ తీసుకుంటున్నారు. అయితే ఇది లిమిట్స్ వరకు ఉంటే బాగానే ఉంటుంది కానీ, హద్దులు దాటితేనే చిరాకేస్తుంది. సోషల్ మీడియాలో కొంతమంది ఆకతాయిలు ఉంటారు. కావాలని స్టార్స్ ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు వేస్తూ నెట్టింట వైరల్ అవుతూ ఉంటారు.
తాజాగా ఇలాంటి సంఘటనే తమిళ స్టార్ బ్యూటీ ప్రియాంక మోహనన్ కు ఎదురయ్యింది. ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో తన అభిమానులతో సరదాగా ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చారు. అయితే అందులో ఓ నెటిజన్ ఆమెను ఓ వింత ప్రశ్న అడిగాడు. మేడం నేను మీ గోళ్లు చూడాలనుకుంటున్నాను, దయచేసి షేర్ చేయరా అంటూ అడిగాడు. దానికి ప్రియాంక స్పందిస్తూ.. రియల్లీ.. అంటూ తన గోర్లను ఫోటో తీసి షేర్ చేశారు. ప్రస్తుతం ప్రియాంక గోళ్ళ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అది చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వాడు ఏ ఉద్దేశంతో అడిగాడో.. అంటూ డబుల్ మీనింగ్ కామెంట్స్ చేస్తున్నారు.
Vadu ey udesamtho adigado ...🏃 pic.twitter.com/oAc08qFQPS
— 🕶️ (@Abdulpspk08) February 25, 2024
ఇక ప్రియాంక మోహనన్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు ఓజీలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతోపాటు నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సరిపోదా శనివారం సినిమాలో కూడా నటిస్తున్నారు ప్రియాంక. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ రెండు సినిమాలు ప్రియాంకకు ఎలాంటి విజయాన్ని అందిస్తాయి చూడాలి.