ఇష్టం లేకుండా ఎలా పట్టుకుంటావ్? మండిపడుతున్న నెటిజన్స్

బాలీవుడ్‌ బిగ్ బాస్ లేటెస్ట్ OTT సీజన్ 2 జియో సినిమాస్ లో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ప్రతీ సీజన్ లో ఎదో కాంట్రవర్సీకి కేరాఫ్ గా నిలిచే బాలీవుడ్‌ బిగ్ బాస్.. లేటెస్ట్ సీజన్లో కూడా మరో కాంట్రవర్సీకి తెరలేపింది. తాజాగా టెలికాస్ట్ అయినా బిగ్ బాస్ OTT సీజన్2లో బాలీవుడ్‌ నటుడు జాద్ హదీద్ చేసిన పని పలు విమర్శలకు దారితీసింది. దీంతో జాద్ హదీద్ పై సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోలింగ్ నడుస్తోంది. 

దానికి కారణం.. దుబాయ్‌కి చెందిన ఈ మోడల్‌ మరో లేడీ కంటేస్టెంట్ ఐన ఆకాంక్ష పూరితో అసభ్యంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. కెమెరాలు  లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా.. ఆకాంక్ష నడుము పట్టుకున్నాడు హదీద్. అంతటితో ఆగకుండా.. దగ్గరకు లాగడానికి ప్రయత్నించాడు. దీంతో ఆకాంక్ష కాస్త అసౌకర్యంగా ఫీల్ అయినట్టు వీడియోలో కనిపించింది. ఇలా తనను తాకడం ఇష్టం లేదని మొహం మీదే చెప్పింది.

ALSO READ:బాలకృష్ణ జోడిగా ఆ హీరోయినా? అవసరమా అంటున్న ఫ్యాన్స్.. 

ఇక ఈ వీడియోను చూసిన బిగ్ బాస్ లవర్స్.. జైద్ హదీద్‌పై దారుణమైన కామెంట్స్‌ చేస్తున్నారు. ఎంతోమంది చూస్తున్న ఈ షోలో ఇలా చేయడం మంచిది కాదు. హోస్ట్‌ సల్మాన్ ఖాన్ జైద్ హదీద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై హోస్ట్ సల్మాన్ ఖాన్ ఎలా సప్నదిస్తారో చూడాలి.