ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల(Sreeleela) అనే చెప్పాలి. పెళ్లి సందడి(Pelli sandadi) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ధమాకా(Dhamaka)తో బాక్సాఫీస్ దుమ్ములేపింది. దీంతో ఈ అమ్మడు వరుస ఆఫర్స్ అందుకుంటోంది. ప్రెజెంట్ టాలీవుడ్ లో వస్తున్న కొత్త సినిమాలన్నింటిలో ఆమెనే హీరోయిన్.
ఇక తాజాగా ఆమె నుండి వస్తున్న మరో మూవీ ఆదికేశవ. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్స్ పనుల్లో వేగం పెంచారు మేకర్స్. వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు చిత్ర యూనిట్. ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లిప్ లాక్ పై శ్రీలీలే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. లిప్ లాక్ ఇవ్వాల్సి వస్తే ఏ హీరోకి ఇస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి సమాధానంగా శ్రీలీల.. నేను ఎవ్వరికీ లిప్ లాక్ ఇవ్వను.. ఒకవేళ ఇవ్వాల్సివస్తే పెళ్లి తరువాత నా భర్తకు మాత్రమే ఇస్తాను అని చెప్పింది.
Also Read : స్కంద OTT రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ?
#Sreeleela husband official confirmation by her. pic.twitter.com/GZoMjLPOQr https://t.co/WID9mqAWJi
— Nuthan ? (@NaanuNuthan) October 28, 2023
అయితే ఈ మ్యాటర్ ను సీరియస్ గా తీసుకున్న నెటిజన్స్ గతంలో ఒక కన్నడ సినిమాలో శ్రీలీల చేసిన లిప్ లాక్ సీన్ ను బయటకు తీసుకొచ్చారు. ఈ వీడియోను షేర్ చేస్తూ శ్రీలీల అడ్డంగా దొరికిపోయింది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. పాపం శ్రీలీల గతంలో తాను చేసిన లిప్ లాక్ సీన్ మర్చిపోయి ఇలా ట్రోలర్స్ కు బుక్ అయ్యింది