IPL 2024: క్రెడిట్ అంతా గంభీర్‌కే.. అయ్యర్‌పై సానుభూతి చూపిస్తున్న నెటిజన్స్

IPL 2024: క్రెడిట్ అంతా గంభీర్‌కే.. అయ్యర్‌పై సానుభూతి చూపిస్తున్న నెటిజన్స్

సాధారణంగా ఒక జట్టు ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిందంటే ఆ ఘనత కెప్టెన్ కే దక్కుతుంది. జట్టులోని ఆటగాళ్లు ఎంత బాగా ఆడినా వారిని ప్రోత్సహిస్తూ ముందకు నడిపించిన కెప్టెన్ కే క్రెడిట్ దక్కుతుంది. గెలిస్తే ప్రశంసలు.. ఓడిపోతే విమర్శలు కెప్టెన్ కు సహజం. అయితే నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌ శ్రేయాస్ అయ్యర్ కు ఇది భిన్నం. ప్రస్తుత సీజన్ లో జట్టును ఫైనల్ కు చేర్చినా అయ్యర్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. అతడి కెప్టెన్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.  

జట్టులోని ఆటగాళ్లకు కొంత క్రెడిట్ వెళ్తే.. మిగిలినది మెంటార్ గంభీర్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. 2012 మరియు 2014లో నైట్ రైడర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన గంభీర్.. మెంటార్‌గా తన సొంత గూటికి తిరిగి వచ్చాడు. ఓపెనర్ గా సునీల్ నరైన్ ను పంపడం.. యువ కుర్రాడు రఘువంశీకు అవకాశాలు ఇవ్వడం.. జట్టులో కీలక మార్పులు సూచించడం లాంటి గంభీర్ నిర్ణయాలు విజయవంతమయ్యాయి. పైగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో వెంకటేష్ అయ్యర్ మా సక్సెస్ కు గంభీర్ కారణమంటూ కామెంట్స్ చేశాడు.          

దీంతో అయ్యర్ ను నెటిజన్స్ అండర్‌రేటెడ్ కెప్టెన్' అని పిలుస్తున్నారు. అయితే ఐపీఎల్ లో అయ్యర్ కెప్టెన్సీని తీసిపారేయలేము. అతని కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్  2020లో తొలిసారి ఫైనల్‌కు చేరింది. దీంతో ఐపీఎల్ చరిత్రలో రెండు జట్లను ఫైనల్స్ కు చేర్చిన తొలి కెప్టెన్ గా అయ్యర్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం (మే 21) జరిగిన క్వాలిఫయర్ 1 లో శ్రేయాస్ చేసిన బౌలింగ్ మార్పులు కేకేఆర్ ను విజయాన్ని అందించాయి. మెరుపు హాఫ్ సెంచరీతో కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి విజయాన్ని అందించాడు. ఇంత చేసినా అయ్యర్ కు ఎలాంటి గుర్తింపు రాకపోవడం దురదృష్టకరం.    

ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్‌‌ గెలిచిన హైదరాబాద్‌‌ 19.3 ఓవర్లలో 159 రన్స్‌‌కే ఆలౌటైంది. రాహుల్‌‌ త్రిపాఠి (35 బాల్స్‌‌లో 7 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 55), క్లాసెన్‌‌ (21 బాల్స్‌‌లో 3 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 32), కమిన్స్‌‌ (24 బాల్స్‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌లతో 30) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత కోల్‌‌కతా 13.4 ఓవర్లలో 164/2 స్కోరు చేసి గెలిచింది. స్టార్క్‌‌కు ‘ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది.