
మంచికి పోతే చెడు ఎదురైందనే సామెత విన్నారు కదా. సరిగ్గా ఇదే జరిగింది మన దర్శకదీరుడు రాజమౌళికి. ఓ చిన్న సినిమాను ప్రమోట్ చేద్దామని చేసిన ట్వీట్ ఇప్పుడు ఆయనకే రివర్స్ అయ్యింది. రాజమౌళిపై ట్రోలింగ్స్ తో రెచ్చిపోతున్నారు నెటిజన్స్. ఇంతకీ ఎం జరిగింది అంటే. చాయ్ బిస్కెట్ సంస్థ నుంచి వచ్చిన తాజా చిత్రం మేం ఫేమస్. అంతా కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ చిన్న సినిమాకు ప్రమోషన్స్ మాత్రం భారీగానే చేసారు మేకర్స్.
అందులో ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమా గురించి పాజిటీవ్ గా ట్వీట్ చేసాడు. ఆ తర్వాత స్టార్ డైరక్టర్ రాజమౌళి కూడా సేమ్ సీన్ రిపీట్ చేశాడు. చాలా కాలం తరవాత.. ఓ సినిమా చూసి, బాగుందంటూ ట్వీట్ చేశాడు రాజమౌళి. దీంతో ఈ సినిమాకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. అయితే రిలీజైన రోజున ఈ సినిమాకు నెగిటీవ్ బజ్ వచ్చింది. రివ్యూలూ కూడా అలానే వచ్చాయి. ఇలాంటి సినిమాకు మహేష్, రాజమౌళి వంటి స్టార్ సెలబ్రెటీలు సపోర్ట్ చేయడం చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
కొందరు.. డైరెక్ట్ గా పెయిడ్ రివ్యూలంటూ రాజమౌళిని విమర్శిస్తున్నారు. మరికొందరైతే రాజమౌళికి బలగం సినిమా గొప్పగా కనిపించలేదా అంటూ నిలదీస్తున్నారు. మీ మాట నమ్మి సినిమాకి వెళ్లాం అక్కడ అంత సీన్ లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ట్వీట్స్ వేయడం మానేసి మహేష్ సినిమాపై కాన్సన్ట్రేట్ చేయమంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. చిన్న సినిమా కోసం పెద్ద మనసు చేసుకొని ట్వీట్ చేస్తే ఇలా రివర్స్ అవుతుందని బహుశా రాజమౌళి కూడా ఊహించి ఉండడేమో పాపం.