
ఈమధ్య కామెడీ పేరుతో చేసే పనులు కారణంగా చిక్కుల్లో పడుతున్నారు. అయితే టాలీవుడ్ కమెడియన్, హీరో సుడిగాలి సుధీర్ తాజాగా కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ఇటీవలే సుధీర్ ఓ షోకి హోస్ట్ గా వ్యవహరించాడు. అయితే ఈ షోలో సుధీర్ తోపాటూ మరో హీరో యాంకర్ రవి, ప్రదీప్ తదితరులు కూడా ఉన్నారు. ఇదే షోకి వెటరన్ హీరోయిన్ రంభ గెస్ట్ గా వచ్చింది.
దీంతో సుధీర్ అప్పట్లో రంభ, మెగాస్టార్ చిరంజీవి నటించిన "బావగారూ బాగున్నారా.?" సినిమాలో ఓ సీన్ ని రీక్రియెట్ చేశారు. ఇందులో భాగంగా సుధీర్ శివుడి వాహనమైన నంది కొమ్ముల మధ్యలోనుంచి చూడగా నటి రంభ కనిపిస్తుంది. దీంతో మరోసారి చూస్తూ దేవుడిని చూస్తే అమ్మోరు దర్శనం కలిగిందంటూ డైలాగులు చెబుతాడు. దీంతో కొందరు ఈ సుధీర్ పై సీరియస్ అవుతున్నారు. నంది కొమ్ముల మధ్యనుంచి చూస్తే కేవలం శివుడు మాత్రమే కనిపిస్తాడని అలాంటిది హీరోయిన్ కనిపించిందంటూ కామెడీ చెయ్యడం సరికాదని కాబట్టి క్షమాపణలు చెప్పాలని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ సుడిగాలి సుధీర్ లేదా షో నిర్వాహకులు ఈ విషయంపై స్పందించలేదు..
Also Read:-మా అన్న కోసం లేడీ గెటప్ కూడా వేశా..
ఈ విషయం ఇలా ఉండగా జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సుధీర్ ఈమధ్య హీరోగా కూడా నటిస్తూ బాగానే రాణిస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్ తెలుగులో గోట్(Greatest Of All Time) అనే సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ కి జంటగా తమిళ్ హీరోయిన్ దివ్య భారతి నటిస్తుండగా పాగల్ మూవీ ఫేమ్ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆమధ్య ఈ సినిమాలోని "అయ్యో పాపం సారూ" అనే పాట రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.